ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం భగవంత్ మాన్

ABN, First Publish Date - 2022-09-27T21:31:03+05:30

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant  singh mann) రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం (Confidence motion) ప్రవేశపెట్టారు. రాజ్‌భవన్‌కు, పంజాబ్ ఆప్ ప్రభుత్వానికి తలెత్తిన అభిప్రాయభేదాలు తొలగి 27న అసెంబ్లీని సమావేశపరచేందుకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ (Banvarilal purohit) అనుమతించారు. దీంతో మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో విశ్వాస తీర్మానాన్ని సీఎం ప్రవేశపెట్టారు. తొలుత  ఒకరోజు సమావేశం ఏర్పాటు చేయాలని మాన్ సర్కార్ అకున్నప్పటికీ అక్టోబర్ 3 వరకూ సమావేశాలను పొడిగించారు.


కాగా, 117 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్‌కు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఆప్‌ను గెలిపిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఎలాంటి భయం లేదని, ఈ విషయమై రాష్ట్రంలోని 3 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు ఆప్ మంత్రి అమాన్ అరోరా తెలిపారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే బీజేపీ ఎమ్మెల్యేలు అశ్వని శర్మ, జాంగి లాల్ మహాజన్ సభ నుంచి వాకౌట్ చేశారు.


తొలుత సెప్టెంబర్ 22న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని మాన్ సర్కార్ భావించింది. అయితే కేవలం విశ్వాస తీర్మానానికే పరిమితమై సభను ఏర్పాటు చేసేందుకు గవర్నర్ పురోహిత్ అనుమతి నిరాకరించారు. దీంతో వ్యర్థపదార్ధాలను తగులబెట్టడం (Stubble burning), జీఎస్‌టీ, విద్యుత్ సరఫరా తదితర అంశాలను కూడా అసెంబ్లీలో చేపట్టనున్నట్టు మాన్ సర్కార్ తెలియజేయండంతో సెప్టెంబర్ 27న అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ అనుమతించారు.

Updated Date - 2022-09-27T21:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising