ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాంగ్‌స్టర్స్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు పంజాబ్ సీఎం ఆదేశం

ABN, First Publish Date - 2022-04-05T21:40:41+05:30

గ్యాంగ్‌స్టర్లపై చర్యలకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉపక్రమించారు. యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: గ్యాంగ్‌స్టర్లపై చర్యలకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉపక్రమించారు. యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు మంగళవారంనాడు ఆదేశాలిచ్చారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ర్యాంకు అధికారి సారథ్యం వహిస్తారు. ''సంస్థాగత నేరాలను నిర్మూలించడం పంజాబ్ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటి. సంస్థాగత నేరాలపై పోరాటానికి పూర్తి స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం'' అని మాన్ సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది.


దేశంలోని స్పెషల్ టాస్క్‌ఫోర్సుల తరహాలోనే మాన్ సర్కార్ తీసుకువచ్చిన యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌కు సైతం ఇంటెలిజెన్స్ సమాచారం క్రోడీకరణ, సిబ్బంది, ఆపరేషన్ల నిర్వహణ, ఎఫ్ఐఆర్‌ల రిజిస్ట్రేషన్, ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అధికారాలు ఉంటాయి. ఇందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, అదనపు వనరులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.

Updated Date - 2022-04-05T21:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising