ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూండి జలాశయ విస్తరణకు ఒప్పుకోం

ABN, First Publish Date - 2022-07-03T14:15:33+05:30

స్థానిక పూండి జలాశయాన్ని విస్తరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని 10 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చెన్నై నగరవాసులకు తాగునీరు అందించే జలాశయాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - పది గ్రామాల ప్రజల నిరసన


ప్యారీస్‌(చెన్నై), జూలై 2: స్థానిక పూండి జలాశయాన్ని విస్తరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని 10 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చెన్నై నగరవాసులకు తాగునీరు అందించే జలాశయాల్లో ఒకటైన పూండి జలాశయం తిరువళ్లూర్‌ జిల్లాలో ఉంది. ఈ జలాశయంలో 35 అడుగుల మేర నీటిని నిల్వ చేయవచ్చు. వర్షాలు అధికంగా కురిసిన సమయంలో జలాశయానికి నీటి రాక అధికం కావడంతో, మిగులు జలాలను కుశస్థలి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసుల తాగునీటి అవసరాలు పెరుగుతుండడంతో జలాశయాన్ని విస్తరించి అదనంగా 2 టీఎంసీల నీటిని నిల్వచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ చర్యలపై పూండి జలాశయ పరివాహక ప్రాంతంలోని 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జలాశయ నీటిమట్టాలు 32 అడుగులకు చేరితేనే తమ గ్రామాల్లోని నీరు చేరుతుందని, అలాంటిది జలాశయం మరింత విస్తరిస్తే తాము గ్రామాలు వదిలి వెళ్లాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జలాశయ విస్తరణకు సంబంధించి ముంపు ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటుచేసిన కమిటీ త్వరలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుందని ప్రజాపనుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2022-07-03T14:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising