Puja: అవహేళన మాటలతో నరకం అనుభవించా...
ABN, First Publish Date - 2022-11-25T12:27:19+05:30
సమాజంలో స్రీ, పురుష లింగ వివక్షకు తోడు అత్యంత ద య నీయమైన స్థితి థర్డ్ జండర్‌దేనని, అవహేళన మాటలతో నరకం అనుభవించానని తొలి థర్డ్
- వివక్ష నుంచే.. విజయకాంక్ష
- బెంగళూరులో భిక్షాటన చేస్తూ గడిపా
- రాయచూరు జిల్లాలో తొలి థర్డ్ జండర్ ఉపాధ్యాయని పూజ
మంగళముఖిగా అందరూ వివక్ష చూపుతున్నా.. పట్టుదలతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన పూజ సమాజంలో లింగ వివక్షలో మార్పు రావాలని కోరుతోంది
రాయచూరు(బెంగళూరు), నవంబరు 24 : సమాజంలో స్రీ, పురుష లింగ వివక్షకు తోడు అత్యంత ద య నీయమైన స్థితి థర్డ్ జండర్‌దేనని, అవహేళన మాటలతో నరకం అనుభవించానని తొలి థర్డ్ జెండర్ ఉద్యోగి పూజ పేర్కొన్నారు. ప్రభుత్వ నియామకాల్లో థర్డ్ జండర్ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ ఆధారంగా రాయచూరు జిల్లాలోని మాన్వికి చెందిన పూజా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. గత మే నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎంపిక పరీక్షల్లో పా ల్గొన్న పూజా సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. మాన్వి తాలూకా నీరమాన్వికి చెం దిన అశ్వథామ(పూజా) ప్రాథమిక విద్యభ్యాసాన్ని స్వంత గ్రామ నీరమాన్విలో 1 నుంచి 10వ తరగతి చదివారు. అనంతరం మాన్వి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్(పీయూసీ) పూర్తి చేసి రాయచూరులోని నవోదయ కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. రాష్ట్రంలో ముగ్గురు థర్డ్ జెండర్లు ఎంపిక కాగా అందులో ఒకరు నీరమాన్వికి చెందిన పూజ ఉండడం విశేషం.
ప్రజల ఆలోచనలో మార్పు రావాలి...
లింగ వివక్షపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు రావాలని పూజ కోరారు. విద్యార్థిగా తాను పురుష రూపంలో ఉన్నప్పటికి అన్ని చేష్టల్లో ఆడపిల్లలు పోలి ఉండడంతో తోటి విద్యార్థులు ఇతరుల నుంచి అవహేళనకరమైన మాటలను అనుభవించానంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బెంగళూరుకు ఆరేళ్ల పాటు థర్డ్ జండర్ వ్యక్తులతో కలిసి బిక్షాటన చేస్తూ జీవనం సాగించానంటూ ఆవేదన భరితంగా తన అనుభవాలను పంచుకున్నారు. ఉ ద్యోగ నియామకాల్లో కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అదృష్టం వరించిందని హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-25T12:27:21+05:30 IST