ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి వర్ష సూచన

ABN, First Publish Date - 2022-03-04T18:28:12+05:30

బంగాళాఖాతంలో కేంద్రీకృత మైన అల్పపీడనం క్రమక్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశమున్నందు వల్ల తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు భారీవర్షాలు కురిసే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

               - పుదువై హార్బర్‌లో ఒకటో నెంబరు  హెచ్చరిక


ప్యారీస్‌(చెన్నై): బంగాళాఖాతంలో కేంద్రీకృత మైన అల్పపీడనం క్రమక్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశమున్నందు వల్ల తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుకోట, కడలూరు, రామనాథపురం డెల్టా జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో చిన్నపాటి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. అదే విధంగా కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలోని కారైక్కాల్‌ హార్బర్‌లో గురువారం ఉదయం ఒకటో నెంబరు తుఫాను హెచ్చరి కను ఆ ప్రభుత్వం జారీచేసింది.ఈనేపథ్యంలో, వాతావరణంలో మార్పుల కారణంగా సంభవించే తుఫానుల నుంచి ప్రజలను కాపాడేలా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఈ రెండు రాష్ట్రప్రభుత్వాలు కలెకర్లకు ఉత్తర్వులు జారీచేశాయి. నాగపట్టణం, మైలాడుదురై, కడలూరు, తంజావూరు, తిరువారూరు, పుదుకోట, అరియలూరు, పెరంబలూరు, కళ్లకుర్చి, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై జిల్లాలకు చెందిన జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Updated Date - 2022-03-04T18:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising