ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుదుకోట జిల్లాలో ఉత్సాహంగా జల్లికట్టు

ABN, First Publish Date - 2022-03-16T14:35:57+05:30

పుదుకోట జిల్లా విరాళిమలై కూత్తాండమ్మన్‌ ఆలయ జాతరను పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన జల్లికట్టులో 250 మందికి పైగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మైదానంలో రంకెలేస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - ఐదుగురికి గాయాలు


ప్యారీస్‌(చెన్నై): పుదుకోట జిల్లా విరాళిమలై కూత్తాండమ్మన్‌ ఆలయ జాతరను పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన జల్లికట్టులో 250 మందికి పైగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మైదానంలో రంకెలేస్తూ పరుగులు తీసిన ఎద్దులను అదుపుచేసే క్రమంలో ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. అమ్మవారి ఆలయ మైదానంలో ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ పోటీల్లో ముందుగా ఆలయ ఎద్దును వడివాసల్‌ గుండా మైదానంలోకి వదిలారు. ఆ తర్వాత తిరుచ్చి, మదురై, కరూర్‌, దిండుగల్‌, తేని, పుదుకోట జిల్లాలకు చెందిన ఎద్దులను ఒక్కొక్కటిగా వదిలారు. ఈ పోటీల్లో ఎవరికి పట్టుబడని ఎద్దులు, వాటి యజమానులకు, ఎద్దులను అదుపుచేసిన యువకులను అభినందిస్తూ రకరకాలు బహుమతులు అందజేశారు. గాయపడిన యువకులకు ఆరోగ్యశాఖ సిబ్బంది వేదిక ప్రాంగణంలోనే ప్రథమ చికిత్సలందించగా, సుమారు 200 మందికి పైగా పోలీసులు బందోబస్తు పనుల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T14:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising