ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pudukota: చదివింపుల విందులో రూ.15 కోట్ల వసూలు

ABN, First Publish Date - 2022-08-19T16:13:12+05:30

పుదుకోట(Pudukota) జిల్లా నెడువాసల్‌ కిళక్కు గ్రామంలో 31 మంది గ్రామ పెద్దలు నిర్వహించిన చదివింపుల విందులో రూ.15 కోట్లు వసూలయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పుదుకోట(Pudukota) జిల్లా నెడువాసల్‌ కిళక్కు గ్రామంలో 31 మంది గ్రామ పెద్దలు నిర్వహించిన చదివింపుల విందులో రూ.15 కోట్లు వసూలయ్యాయి. పుదుకోట, తంజావూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఏన్నో ఏళ్లుగా ఆడి మాసం తర్వాతే వచ్చే ఆని నెలలో చదివింపుల విందు కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ విందుల్లో కోట్లాది రూపాయలు వసూలవుతుంటాయి. ఆ నగదును గ్రామాభివృద్ధికార్యక్రమాలకు, గ్రామంలోని నిరుపేదలను ఆదుకునేందుకు, పేద యువతుల వివాహాలకు, పేద విద్యార్థుల చదువులకు ఆర్థికసాయంగా అందిస్తారు. గత రెండేళ్లుగా కరోనా లాక్‌డౌన్‌(Corona Lockdown) కారణంగా చదివింపుల విందులు నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం పుదుకోట జిల్లా నెడువాసల్‌ కిళక్కు గ్రామంలో 31 మంది ప్రముఖులు కలిసి చదివింపుల విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత వచ్చినవారంతా అక్కడ సిద్ధంగా ఉంచిన పాత్రల్లో తమకు తోచినంత నగదు చదివింపులుగా వేశారు. ఇలా వచ్చిన నగదును నిర్వాహకులు బుధవారం సాయంత్రం లెక్కించి, రూ.15కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించారు.  

Updated Date - 2022-08-19T16:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising