ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister's Statement: యూనివర్సిటీగా ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్యకళాశాల

ABN, First Publish Date - 2022-08-17T13:30:01+05:30

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్యకళాశాల వైద్య విశ్వవిద్యాలయంగా, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా స్థాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                - పుదుచ్చేరి సీఎం రంగస్వామి


పుదుచ్చేరి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్యకళాశాల వైద్య విశ్వవిద్యాలయంగా, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా స్థాయి పెంచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరి రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్ధేశంతో ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్యకళాశాలను విశ్వవిద్యాలయంగా పెంచినట్లు తెలిపారు. శనీశ్వరాలయం ఉన్న కారైక్కాల్‌లో వైద్యకళాశాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వ అనుమతి కోరినట్లు సీఎం తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్‌(Lockdown) విధించిన రోజుల్లో పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు(Hyderabad, Bangalore) మధ్య బోయింగ్‌ విమాన సేవలు నిలిపివేశామని, ప్రస్తుతం పర్యాటక వ్యవస్థ మెరుగుపర్చేలా మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో పెద్ద విమానాలు ల్యాండింగ్‌ అయ్యేందుకు వీలుగా రన్‌వే విస్తరింపజేసేందుకు కేంద్రప్రభుత్వం నుంచి రూ.425 కోట్ల నిధులు కోరినట్లు సీఎం రంగస్వామి(CM Rangaswamy) తెలిపారు.

Updated Date - 2022-08-17T13:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising