ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ సెలవులు ప్రాథమిక హక్కు కాదు : బోంబే హైకోర్టు

ABN, First Publish Date - 2022-01-07T22:07:19+05:30

ప్రభుత్వ సెలవు దినంగా ఏదైనా రోజును ప్రకటించాలని ఆదేశించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రభుత్వ సెలవు దినంగా ఏదైనా రోజును ప్రకటించాలని ఆదేశించేందుకు చట్టబద్ధంగా అమలు చేయదగిన ప్రాథమిక హక్కు ఏదీ లేదని బోంబే హైకోర్టు చెప్పింది. ఏ రోజునైనా ప్రభుత్వ సెలవు దినంగా కానీ, ఐచ్ఛిక సెలవు దినంగా కానీ ప్రకటించడమనేది ప్రభుత్వ విధానానికి సంబంధించిన విషయమని పేర్కొంది. ఇప్పటికే మన దేశంలో చాలా ఎక్కువ ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నాయని, వీటిని తగ్గించవలసిన సమయం వచ్చిందని, పెంచవలసిన సమయం కాదని వివరించింది. 


దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం విముక్తి దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆగస్టు 2ను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 


1954 ఆగస్టు 2న దాద్రా అండ్ నగర్ హవేలీ పోర్చుగీసు పాలన నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి 2020 వరకు ఆగస్టు 2ను ప్రభుత్వ సెలవు దినంగా అమలు చేశారు. కానీ 2021 జూలై 29న దీనిని రద్దు చేశారు. ఆగస్టు 15ను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి, అమలు చేస్తున్నపుడు, ఆగస్టు 2ను ఎందుకు ఆ విధంగా ప్రకటించరాదని పిటిషనర్ ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-07T22:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising