ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయండి...అధికారులకు సీఎం ఆదేశం

ABN, First Publish Date - 2022-04-26T17:33:32+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  అధికారులను ఆదేశించారు.నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు అదనపు విద్యుత్‌ కోసం కూడా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.లోక్‌భవన్‌లో జరిగిన విద్యుత్ శాఖ సమావేశంలో అధికారులను ఉద్ధేశించి సీఎం యోగి మాట్లాడారు.వేసవిలో విద్యుత్తు చాలా అవసరమని, అందుకే రోస్టర్ ప్రకారం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కోరారు.ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయకపోవడం లేదా విద్యుత్ వైర్లు దెబ్బతినడం వల్ల తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదిత్యనాథ్ సూచించారు.కరెంటు బిల్లు చెల్లించనందుకు కరెంటు తీయడం పరిష్కారం కాదని, వినియోగదారుడితో చర్చలు జరిపి బిల్లు చెల్లించేలా ప్రేరేపించాలని సీఎం సూచించారు.


కరెంటు బిల్లుల వసూళ్లకు మెరుగైన, ప్రభావవంతమైన వ్యవస్థలను రూపొందించాలని కోరారు.కరెంటు బిల్లుల వసూళ్లకు మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.పట్టణ ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను సకాలంలో అమర్చాలని యోగి కోరారు. విద్యుత్ ఉత్పత్తికి నిరంతరం బొగ్గు లభ్యత ఉండేలా చూడాలని, ఇందుకోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చెప్పారు.భూగర్భంలో విద్యుత్తు తీగల ఏర్పాటు చేసే పనులను గడువులోగా పూర్తి చేయాలని సీఎం యోగి ఆదేశించారు.


Updated Date - 2022-04-26T17:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising