ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prophet Comment Row: నూపుర్ శర్మకు రాజ్‌థాకరే మద్దతు

ABN, First Publish Date - 2022-08-24T00:14:10+05:30

ముంబై: మహ్మద్ ప్రవక్త(Prophet Mohammed)పై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ (former BJP leader Nupur Sharma)కు మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే మద్దతు పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహ్మద్ ప్రవక్త(Prophet Mohammed)పై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ (former BJP leader Nupur Sharma)కు మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే (Raj Thackeray) మద్దతు పలికారు. గతంలో వివాదాస్పద ఇస్లాం మత పెద్ద జకీర్ నాయక్ (Zakir Naik) చెప్పిన విషయాలనే నూపుర్ శర్మ టీవీ ఛానెల్ డిబేట్‌లో ప్రస్తావించారని చెప్పారు. జకీర్ నాయక్‌ను ఎప్పుడైనా క్షమాపణ చెప్పమని అడిగారా అని థాకరే ప్రశ్నించారు. నూపుర్ శర్మ ఎందుకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ దేవతలను అనేకసార్లు కించపరిచాడని థాకరే గుర్తుచేశారు. 






మరోవైపు నూపుర్ శర్మకు మద్దతిచ్చారనే కారణంతో పూణేలో ఉమేశ్‌ అనే ఫార్మసిస్ట్‌ను, ఉదయ్‌పూర్‌లో కన్నయ్యలాల్ అనే టైలర్‌ను దుండగులు హత్య చేశారు.     


నూపుర్ శర్మను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కూడా టార్గెట్ చేసింది. ఆత్మాహుతి దాడి (suicide attack) ద్వారా ఆమెను చంపాలనుకున్న ఐసిస్ ఉగ్రవాది (Islamic State terrorist)ని రష్యా(Russia)కు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (Federal Security Service) అరెస్ట్ చేసింది. ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడని, దర్యాప్తు కొనసాగుతోందని రష్యా అధికారులు తెలిపారు. 


జూన్ నెలలో నూపుర్ శర్మ (Nupur Sharma)ను చంపేందుకు రిజ్వాన్ అష్రఫ్ (Rizwan Ashraf) అనే ఓ పాక్ జాతీయుడు (Pakistani) అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చాడు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా హిందూమల్‌కోట్ వద్ద సరిహద్దు దాటి అనుమానాస్పదంగా సంచరిస్తోన్న రిజ్వాన్‌ను ఈ నెల 16న సరిహద్దు గస్తీ దళం (Border Security Force) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో (IB), రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), మిలిటరీ ఏజెన్సీ అధికారులు సంయుక్తంగా ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. రిజ్వాన్ వద్ద ఉన్న సంచిలోనుంచి 11 అంగుళాల కత్తిని, మతపరమైన సాహిత్యాన్ని, మ్యాపులను, ఆహార పదార్ధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 


నూపర్‌‌‌ను చంపేందుకు ఆగస్ట్ రెండోవారంలో కుట్రపన్నిన మహ్మద్ నదీమ్ (Mohammad Nadeem) అనే ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Uttar Pradesh anti terrorism squad) అదుపులోకి తీసుకుంది. షహరాన్‌పూర్‌కు చెందిన నదీమ్‌‌ 2018 నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. జైష్ ఎ మహ్మద్‌ (Jaish-e-Mohammad), తెహ్రీక్ ఎ తాలిబన్(Tehreek-e-Taliban ) వంటి ఉగ్రవాద సంస్థలతో నదీమ్‌కు సంబంధాలున్నాయని తేల్చారు. యూపీలో భారీ విధ్వంసానికి కుట్ర చేస్తుండగా నదీమ్‌ను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. విచారణ కొనసాగుతోంది. 

Updated Date - 2022-08-24T00:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising