ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Property tax: పేదలకు శుభవార్త...ఈడబ్ల్యూఎస్ కాలనీల్లో ఇళ్లకు ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ

ABN, First Publish Date - 2022-07-27T18:35:45+05:30

కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్(Chandigarh) పాలకులు పేద(EWS) ప్రజలకు శుభవార్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్(Chandigarh) పాలకులు పేద(EWS) ప్రజలకు శుభవార్త వెల్లడించారు. పేదల కాలనీల్లోని(houses at EWS colonies) 16,000 మంది ఇళ్ల నివాసితులకు ఆస్తిపన్నులో(Property tax) 50 శాతం రాయితీ(waiver) ఇస్తున్నట్లు చండీఘడ్ అధికారులు ప్రకటించారు. 500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ ఉన్న ఇళ్లకు ఆస్తి పన్నులో 50 శాతం మాఫీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర పరిపాలన శాఖ విడుదల చేసింది.రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలకు 2022-23 ఆస్తి పన్నును రిబేట్ ప్రయోజనాలతో చెల్లించడానికి చివరి తేదీగా ఆగస్ట్ 31 వరకు పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు అనుగుణంగా యూటీ అడ్మినిస్ట్రేటర్ పేదల (EWS) కాలనీలకు ఉపశమనం కల్పించారు.



రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు 2019-20, 2020-21, 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరాలకు పెనాల్టీ, వడ్డీ కూడా మాఫీ చేశారు.వాణిజ్య ఆస్తులపై అన్ని బకాయిలపై పెనాల్టీ, వడ్డీలో 100శాతం మాఫీ ఉంటుంది. పన్ను మాఫీని పొందకుండా ఆస్తి పన్నును ఇప్పటికే జమ చేసిన పేదల కాలనీల నివాసితులు భవిష్యత్ అసెస్‌మెంట్‌లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2022-07-27T18:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising