ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు హైదరాబాద్‌కు ప్రధాని

ABN, First Publish Date - 2022-05-25T08:53:00+05:30

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ)లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్‌ వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఎస్‌బీలో రెండు కార్యక్రమాలకు హాజరు

కేంద్రం అధికారిక వెల్లడి


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ)లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్‌ వెళ్లనున్నారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రధాన మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు ఐఎ్‌సబీ 20 వార్షికోత్సవ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటారని పేర్కొంది. 2022 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ క్లాసుల గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ప్రసంగిస్తారని తెలిపింది. మరోవైపు, హైదరాబాద్‌ పర్యటన తర్వాత అదే రోజు సాయంత్రం ప్రధాని మోదీ చెన్నైకి వెళ్లనున్నారు. రూ. 31,400 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ప్రయాణించే బెంగళూరు - చెన్నై (262 కి.మీ) ఎక్స్‌ప్రెస్‌ హైవే కూడా ఉంది. 


ఐఎస్‌బీ, గచ్చిబౌలి స్టేడియం.. చుట్టుపక్కల డ్రోన్‌ల నిషేధం

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐఎ్‌సబీ, గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ ఏయిర్‌ క్రాఫ్ట్స్‌ వంటివి ఎగురవేయడం నిషేధం విధించారు. ఈనెల 25న మధ్యాహ్నం 12గంటల నుంచి 26 సాయంత్రం 6 గంటల వరక ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి

Updated Date - 2022-05-25T08:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising