ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరి-కావేరీ నదులను అనుసంధానించండి

ABN, First Publish Date - 2022-06-10T12:44:51+05:30

పీఎంకే అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ గురువారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రధానికి అన్బుమణి వినతి

- 20 నిమిషాల పాటు భేటీ


చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): పీఎంకే అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ గురువారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పగ్గాలు చేబూనిన అన్బుమణిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ ఆరోగ్యం ఎలా వుందని కుశలప్రశ్నలు వేశారు. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని, ఉన్నత విద్యావేత్త అయిన అన్బుమణి భవిష్యత్తులోనూ రాణించి, ప్రజలకు సేవ చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ... తమిళనాడు ప్రయోజనాల కోసం కావేరి - గోదావరి అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని కోరారు. సంబంధిత ముఖ్యమంత్రులతో భేటీ అయి చర్చించాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా అన్ని నదులపై డ్యాంలు నిర్మించాలని కోరారు. తమిళనాడు వైద్యవిద్యార్థుల ప్రవేశానికి నీట్‌ పరీక్ష నుంచి మినహాయించాలని, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానికి వినతిపత్రాన్ని కూడా అందించారు

Updated Date - 2022-06-10T12:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising