ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన మోదీ.. దరిదాపుల్లో లేని బైడెన్

ABN, First Publish Date - 2022-08-27T01:31:02+05:30

వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాధినేతల్లో మళ్లీ నెంబర్ వన్‌గా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాధినేతల్లో మళ్లీ నెంబర్ వన్‌గా నిలిచారు. అప్రూవల్ రేటింగ్‌లో ఆయన అగ్ర స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. ఈ నెల 17 నుంచి 23 మధ్య జరిపిన సర్వేలో మోదీకి 75 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చిందని తెలిపింది.  


మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ 63 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ఉన్నారు. ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంటొనీ 58 శాతం అప్రూవల్ రేటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నారు.  


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 41 శాతం అప్రూవల్ రేటింగ్‌ వచ్చింది. అల్‌ఖైదా అధినేత అల్ జవహరిని ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ ద్వారా హతమార్చిన నేపథ్యంలో ఆయన రేటింగ్స్ పెరుగుతాయని అంచనావేశారు. అయినా కూడా పెద్దగా మార్పేమీ రాకపోవడం గమనార్హం.  


ప్రపంచ నేతలకు కల ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ అత్యధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. ఏడు రోజులపాటు వయోజనులైన ప్రజల మూవింగ్ యావరేజ్‌ను పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి సంఖ్య వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉన్నట్లు తెలిపింది. 

Updated Date - 2022-08-27T01:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising