ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi's visit to Chennai: 28న ప్రధాని మోదీ చెన్నై పర్యటన

ABN, First Publish Date - 2022-07-26T15:41:15+05:30

చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నగరానికి చేరుకోనున్నారు. స్థానిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - 22 వేల మంది పోలీసులతో భద్రత


పెరంబూర్‌, జూలై 25: చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నగరానికి చేరుకోనున్నారు. స్థానిక పెరియమేడులోని నెహ్రూ క్రీడా మైదానంలో జరిగే కార్యక్రమంలో చెస్‌ పోటీలు ప్రారంభించనున్న ప్రధాని, మరుసటిరోజు అన్నా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా నగరంలో భారీ పోలీసు భద్రత ఏర్పాట్లు చేపడుతున్నారు.. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ నుంచి ప్రత్యేక విమానంలో 28వ తేది సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చెన్నై విమానాశ్రయానికి(To Chennai Airport) చేరుకోనున్న ప్రధాని, అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా నేపియర్‌ బ్రిడ్జి సమీపంలోని అడయార్‌ ఐఎన్‌ఎస్‌ నావికాదళ మైదానం చేరుకోనున్నారు. అక్కడి నుంచి చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమ జరిగే నెహ్రూ స్టేడియానికి ప్రధాని కారులో వెళ్లనున్నారు. ఈ మార్గంలో ప్రధానికి ఆహ్వానం పలికేలా భారీ ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని పర్యటన సందర్భంగా 28,29వ తేదీల్లో నగరంలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‏జీ) కమాండోలు, కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, స్థానిక పోలీసులు, సాయుధదళ విభాగం, తమిళనాడు(Tamilnadu) రిజర్వ్‌ పోలీసులు ఐదంచెల భద్రతలో పాల్గొననున్నారు. నగరవ్యాప్తంగా 22 వేల మంది పోలీసులు భద్రతా విధులు చేపట్టనున్నారు. నెహ్రూ స్టేడియం, అన్నా విశ్వవిద్యాలయం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, గిండిలోని గవర్నర్‌ బంగ్లా నుంచి అన్నా విశ్వవిద్యాలయానికి ప్రధాని వెళ్లే మార్గంలో పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ప్రధాని పర్యటన సందర్భంగా 28,29 తేదీల్లో నగరంలో డ్రోన్‌ కెమెరాలను నిషేధించారు. అడయార్‌ ఐఎన్‌ఎస్‌ నుంచి నెహ్రూ స్టేడియం, రాజ్‌భవన్‌ నుండి అన్నా విశ్వవిద్యాలయం మార్గాల్లో మాక్‌ డ్రిల్‌ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు.

Updated Date - 2022-07-26T15:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising