ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ram Nath Kovind: రాష్ట్రపతిగా చివరి ప్రసంగంలో చివరి రిక్వెస్ట్

ABN, First Publish Date - 2022-07-25T02:23:09+05:30

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లా పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతి (president of india)గా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లా పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతి (president of india)గా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) చెప్పారు. రాష్ట్రపతిగా తన చివరి ప్రసంగంలో ఆయన అనేక సంఘటనలను గుర్తుచేసుకున్నారు.






రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక తన సొంతూరు పర్వౌంఖ్‌లో తన గురువులు, పెద్దల పాదాలకు నమస్కరించడం తాను ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అని రామ్‌నాథ్ చెప్పారు. చిన్నారులు, విద్యార్ధులు, యువత భారత సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోవద్దన్నారు. నూతన విద్యా విధానం భారత వారసత్వ గొప్పతనాన్ని ప్రస్తుత తరాలకు అందిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. యువతరం తమ పుట్టి పెరిగిన ఊరుతోనూ, గురువులు, పెద్దలతో అనుబంధం కలిగి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. భారత్‌లో నాయకత్వానికి ఢోకాలేదన్నారు. అనేక మంది నాయకులు ప్రతితరంలోనూ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని రామ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. జవాన్లు, పారామిలిటరీ, పోలీసులను కలుసుకున్న సందర్భాలు ప్రేరణాదాయకంగా ఉన్నాయని ఆయన చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ప్రస్తుత తరాల వారు ప్రకృతిని, భూమాతను, గాలిని, నీటిని కాపాడాలని రామ్‌నాథ్ సూచించారు. 



Updated Date - 2022-07-25T02:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising