ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ విదేశాంగ మంత్రిగా బిలావల్ ప్రమాణం

ABN, First Publish Date - 2022-04-27T23:31:37+05:30

ఇస్లామాబాద్: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అయ్యారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో బిలావల్‌తో పాక్ అధ్యక్షుడు రషీద్ అల్వీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పీపీపీ నేతలు, బిలావల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. విదేశాంగ మంత్రి పదవి చేపట్టిన పిన్న వయస్కుడు బిలావల్ భుట్టోయే కావడం విశేషం. 33 సంవత్సరాల బిలావల్ భుట్టో పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు. లండన్ ఆక్స్‌ఫర్డ్‌లో హిస్టరీ, పాలిటిక్స్ చదువుకున్నారు. 




పాకిస్థాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ మార్పుల్లో భాగంగా ఇమ్రాన్ సర్కారు కూలిపోయి పీపీపీ, పీఎంఎల్ ఎన్ తదితర పార్టీల మద్దతుతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. పీఎంఎల్ ఎన్ అధినేత షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధాని అయ్యారు. మూడు రోజుల క్రితమే బిలావల్ భుట్టో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను లండన్‌లో కలుసుకుని చర్చలు జరిపారు. 

Updated Date - 2022-04-27T23:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising