ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాంకీ బిహారీ దేవాలయాన్ని సందర్శించనున్న President Ram Nath Kovind

ABN, First Publish Date - 2022-06-24T18:42:34+05:30

త్వరలో పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చివరిగా బాంకీ బిహారీ దేవాలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో(ఉత్తరప్రదేశ్): త్వరలో పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చివరిగా బాంకీ బిహారీ దేవాలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన పదవీకాలం జూలైలో ముగిసేలోపు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించాలని భావిస్తున్నారు.ఆలయ సందర్శనకు  రాంనాథ్‌తో పాటు ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా రానున్నారు. రాష్ట్రపతికి యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలకనున్నారు.రాష్ట్రపతి చివరి పర్యటన కోసం మధుర, బృందావన్‌లలో సన్నాహాలు ప్రారంభించారు. ఆయన పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఆగ్రా పోలీసులు, ఇతర నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.


మథుర జిల్లా మేజిస్ట్రేట్ నవనీత్ సింగ్ చాహల్ గురువారం రాష్ట్రపతి సందర్శించే ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) రాజీవ్ కృష్ణ మధురలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూ దేవాలయాన్ని ఊడ్చి శుభ్రం చేయగా, పదవీ విరమణ చేయనున్న కోవింద్ చివరి అధికార పర్యటనగా దేవాలయాన్ని సందర్శించనుండటం విశేషం.  


Updated Date - 2022-06-24T18:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising