ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

British Queen : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, First Publish Date - 2022-09-14T20:57:50+05:30

బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హాజరవుతారు. ఈ నెల 17న ఆమె లండన్ బయల్దేరుతారు, ఈ నెల 19న క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి. భారత ప్రభుత్వం తరపున ద్రౌపది సంతాపం తెలుపుతారు. ఈ వివరాలను విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 


యునైటెడ్ కింగ్‌డమ్, కామన్వెల్త్ నేషన్స్ అధిపతి ఎలిజబెత్-2 ఈ నెల 8న మరణించారు. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ నెల 12న బ్రిటిష్ హై కమిషన్‌ను సందర్శించి, భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలిపారు. భారత దేశం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగా పాటించింది. 


క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఈ నెల 19న జరుగుతాయి. దీని కోసం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. దీంతో బ్రిటన్‌లోని కొన్ని మీడియా సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తున్న దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. 


Updated Date - 2022-09-14T20:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising