ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యశ్వంత్‌సిన్హాకు సంపూర్ణ మద్దతు

ABN, First Publish Date - 2022-07-01T14:08:50+05:30

దేశంలోని ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్‌ నేత యశ్వంత్‌సిన్హాకు రాష్ట్రంలోని అధికార డీఎంకే, దానిమిత్రపక్షాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎంకే, కాంగ్రెస్‌, ఇతర మిత్రపక్షాల హామీ

- పొగడ్తలతో ముంచెత్తిన నేతలు


చెన్నై, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్‌ నేత యశ్వంత్‌సిన్హాకు రాష్ట్రంలోని అధికార డీఎంకే, దానిమిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎన్నికల్లో మద్దతు కోరేందుకు గురువారం సాయంత్రం చెన్నై వచ్చిన యశ్వంత్‌సిన్హా  తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం చేరుకున్నారు. ఆయన వెంట డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి ఉండగా, అరివాలయం వద్ద ముఖ్యమంత్రి స్టాలిన్‌, సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎండీఎంకే నేత వైగో, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత సెల్వపెరుందగై, మణిదనేయ మక్కల్‌కట్చి జవహిరుల్లా, సీపీఎం, సీపీఐల శాసనసభాపక్షనేతలు, మిత్రపక్షాల నేతలతో యశ్వంత్‌సిన్హా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైతం ఆయనకు మద్దతు ప్రకటించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యశ్వంత్‌సిన్హా మాట్లాడుతూ.. స్టాలిన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాల సంగతెల్లాగున్నా తమిళనాట దృఢమైన ప్రభుత్వం నడుస్తోందని, అందుకే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖల్ని ఉసిగొల్పుతున్న కేంద్రప్రభుత్వం.. తమిళనాడు వైపు కన్నెత్తి చూడలేకపోతోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు యశ్వంత్‌సిన్హాకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో దూరంగా కూర్చున్న తన కుమారుడు, చేపాక్‌ ఎమ్మెల్యే ఉదయనిధిని దగ్గరకు పిలిచిన సీఎం.. యశ్వంత్‌సిన్హాకు పరిచయం చేశారు. దాంతో ఉదయనిధి ఆయనను సత్కరించడంతో పాటు తన తాత కరుణానిధికి సంబంధించిన పుస్తకాన్ని బహూకరించారు.

Updated Date - 2022-07-01T14:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising