ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NEW CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్

ABN, First Publish Date - 2022-08-10T23:48:25+05:30

సుప్రీంకోర్టు 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 49వ భారత ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India)గా ఉదయ్ ఉమేష్ లలిత్‌ (UU Lalit)ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) బుధవారంనాడు నియమించారు. 2022 ఆగస్టు 27వ తేదీ నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుంది.


కొత్త సీజేఐ పేరును సిఫారసు చేయాలని కోరుతూ ఆగస్టు 3వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సీజేఐ సెక్రటేరియట్‌కు లేఖ పంపారు. ఆ మరుసటి రోజే సీజేఐ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టులో సెకెండ్ సీనియర్ మోస్ట్ ‌జడ్జి అయిన యూయూ లలిత్ పేరును సిఫారసు చేసారు. ఈనెల 26వ తేదీతో సీజేఐ ఎన్‌వీ రమణ పదవీ కాలం ముగుస్తోంది.


కాగా, 49వ సీజేఐ లలిత్ ‌పదవీ విరమణ వ్యవధి కూడా మూడు నెలల కంటే తక్కువగా ఉంది. 2022 నవంబర్ 8న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదోన్నతి పొందారు. దీనికి ముందు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ఉన్నారు. యూయూ లలిత్ తండ్రి యూఆర్ లలిత్ సైతం సీనియర్ అడ్వకేట్. ముంబై హైకోర్టు అడిషనల్ జడ్జిగా ఉన్నారు.

Updated Date - 2022-08-10T23:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising