ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకొస్తున్న అసానీ తుఫాన్

ABN, First Publish Date - 2022-03-20T00:30:20+05:30

మరో రెండు రోజుల్లో తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో, దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది అండమాన్-నికోబార్ అధికార యంత్రాంగం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈనెల 21 నాటికి తుఫాన్‌గా మారుతుందని ఇప్పటికే ఇండియన్ మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో రెండు రోజుల్లో తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో, దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది అండమాన్-నికోబార్ అధికార యంత్రాంగం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈనెల 21 నాటికి తుఫాన్‌గా మారుతుందని ఇప్పటికే ఇండియన్ మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది. ఈ తుఫాన్‌కు అసానీ అని నామకరణం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం అండమాన్-నికోబార్ దీవులపైనే ఎక్కువగా పడనుంది. అయితే, అసానీని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తోంది అక్కడి అధికార యంత్రాంగం.


అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ స్థానిక అధికారులతో ఈ అంశంపై ఇప్పటికే చర్చించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయడం, ఆహారం, నీరు వంటివి అందుబాటులో ఉంచడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని నారాయణ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు షిప్పింగ్ సర్వీసుల్ని, చేపల వేటను రద్దు చేశారు. తుఫాన్ ప్రభావిత దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-03-20T00:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising