ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monkeypox: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంకీపాక్స్ బాధితురాలు

ABN, First Publish Date - 2022-07-29T02:51:00+05:30

అమెరికాలో మంకీపాక్స్ (monkeypox) బాధితురాలు ఒకరు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెరికాలో మంకీపాక్స్ (monkeypox) బాధితురాలు ఒకరు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. గతంలో వైరస్‌ల వ్యాప్తి సమయంలో తల్లి గర్భం నుంచి శిశువుకు అది సోకేదని, ఈసారి మాత్రం అలాంటిదేమీ కనిపించలేదని సీడీసీకి చెందిన డాక్టర్ జాన్ బ్రూక్స్ తెలిపారు. 


సీడీసీ డేటా ప్రకారం.. గర్భిణుల్లో తీవ్రమైన ఫలితాలకు దారితీసే మంకీపాక్స్ ఫ్రీక్వెన్సీ పరిమితంగా ఉంటుంది. దానిని నిర్ధారించడం సవాలుతో కూడుకున్నది. కాబట్టి గర్భిణులు, ఇటీవలే గర్భం దాల్చినవారు, పాలిచ్చే తల్లులు అవసరమైతే చికిత్స తీసుకోవాలని సీడీసీ సూచించింది. శిశువుకు ఇమ్యూన్ గ్లోబులిన్ ఇచ్చినట్టు సీడీసీ తెలిపింది.


మంకీపాక్స్ వ్యాప్తి సమయాల్లో యాంటీబాడీ చికిత్సగా ఇమ్యూన్ గ్లోబులిన్ ఇచ్చేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. అమెరికాలోని చిన్నారుల్లో ఇప్పటి వరకు రెండు మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. స్పెయిన్‌లో అత్యధికంగా 3,596  కేసులు నమోదయ్యాయి.  

Updated Date - 2022-07-29T02:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising