ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు పుడతాడని తలలో మేకు దింపుకున్న గర్భిణి

ABN, First Publish Date - 2022-02-10T01:05:07+05:30

పాకిస్తాన్‌లో కూడా ఇలాంటి ఒక దారుణ ఘటన మరొక ఉదాహారణ. తలలో మేకులు కొట్టుకుంటే కొడుకు పుడతారని ఒక మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మిన ఒక గర్భిణి.. తన తలలో మేకు కొట్టుకుని ఆసుపత్రి పాలయ్యింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిందీ ఘటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: మంచి పనులు చేస్తే కొడుకు పుడతాడని పురాత గ్రంథాల్లో చెప్పారు. అదేంటో, కూతురి గురించి ఎక్కడా కనిపించదు. కొడుకులు మాత్రమే వారసులు అనే మన సమాజంలో చాలా బలంగా ఉంది. ఆస్తి పంపకాల్లో కూడా కూతురు నామమత్రమే. ఇస్తే తీసుకోవాలి కానీ అడిగే హక్కు లేదు. మన దేశంతో పాటు మన చుట్టుపక్కల దేశాల్లో చాలా బలంగా ఉన్న సంప్రదాయం ఇది. ఇలాంటి సంప్రదాయాలు కొంత వరకు సంస్కరణకు వచ్చినప్పటికీ ప్రజల బలహీనతలు, విశ్వాసాలను ఆసరగా చేసుకుని చెలరేగిపోయేవారి పప్పులు ఇంకా ఉడుకుతూనే ఉన్నాయనే దానికి ఆ మధ్య మదనపల్లిలో జరిగిన కిరాతక ఘటన ఉదాహారణ.


కాగా, పాకిస్తాన్‌లో కూడా ఇలాంటి ఒక దారుణ ఘటన మరొక ఉదాహారణ. తలలో మేకులు కొట్టుకుంటే కొడుకు పుడతారని ఒక మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మిన ఒక గర్భిణి.. తన తలలో మేకు కొట్టుకుని ఆసుపత్రి పాలయ్యింది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిందీ ఘటన. పాకిస్తాన్‌లోని కొన్ని పాఠశాలల్లో ఇలాంటి నమ్మకాలు ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.


గర్భిణి చాలా గాయపడిందని, మెదడు చాలా వరకు దెబ్బతిందని పెషావర్‌లో ఆమెకు వైద్యం చేసిన ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉందని అయితే ఎక్స్‌రే తీసి చూడగా ఐదు సెంటిమీటర్ల మేరకు తలలో మేకు దిగిందని, బలమైన ఆయుధంతో మేకును తన తలలోకి దింపుకుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పెషావర్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-02-10T01:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising