ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్‌లో చిక్కుకుపోయిన న్యూజీలాండ్ గర్భిణీ జర్నలిస్ట్

ABN, First Publish Date - 2022-01-30T17:46:06+05:30

నిన్నటి వరకు అఫ్ఘాన్‌లో మహిళల పరిస్థితిపై తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బెల్లిస్.. తాజాగా సొంత ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారికి న్యూజీలాండ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: అఫ్ఘానిస్తాన్ వెళ్లిన న్యూజీలాండ్‌కు చెందిన చార్లెట్ బెల్లిస్ అనే గర్భిణీ జర్నలిస్ట్ అక్కడే చిక్కుకుపోయారు. కొవిడ్ క్వారంటైన్ కారణంగా ఆమె అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. తాను స్వదేశానికి వెళ్లడానికి సహాయం చేయాలని తాలిబన్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అయితే తాలిబన్ నుంచి ఆమెకు ఉపశమనం కలిగించే సమాధానం రాలేదు. దీంతో తనను స్వదేశానికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేయాలని న్యూజీలాండ్ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. ఆ లేఖలో తన పరిస్థితిని వివరిస్తూ ‘‘క్రూరమైన చర్య’’ అని విమర్శించారు.


నిన్నటి వరకు అఫ్ఘాన్‌లో మహిళల పరిస్థితిపై తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బెల్లిస్.. తాజాగా సొంత ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారికి న్యూజీలాండ్ మాండేటరీ ఐసోలేషన్ అండ్ క్వారంటైన్ (ఎంఐక్యూ) పేరుతో కొన్ని నిబందనలు అమలు చేసింది. ఈ నిబంధనల వల్ల బెల్లిస్ అఫ్ఘాన్‌లో ఆగిపోవాల్సి వచ్చింది. చార్లెట్ బెల్లిస్ అనే ఈ జర్నలిస్ట్ అఫ్ఘానిస్తాన్‌లో అల్ జజీరా మీడియా తరపున రిపోర్టింగ్ చేస్తుంటారు. అయితే సెప్టెంబర్‌లో ఆమె ఖతార్‌లోని ఆల్ జజీరా హెడ్‌క్వార్టర్స్‌కి ఒక లేఖ రాశారు. అందులో తాను గర్భవతినని, బిడ్డను తన మాతృదేశంలోనే కనాలని అనుకుంటున్నట్లు పేర్కొని నవంబర్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆమె అఫ్ఘాన్ నుంచి బయటికి రాలేకపోయారు.

Updated Date - 2022-01-30T17:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising