ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మహాభారత్‌’ భీముడు పాత్రధారి ప్రవీణ్‌కుమార్‌ సోబ్తీ కన్నుమూత

ABN, First Publish Date - 2022-02-09T08:14:13+05:30

బి.ఆర్‌. చోప్రా దర్శకత్వంలోని మహాభారత్‌ టీవీ సీరియ్‌సలో భీముడిగా న టించి.. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ ఇకలేరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నటుడు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : బి.ఆర్‌. చోప్రా దర్శకత్వంలోని మహాభారత్‌ టీవీ సీరియ్‌సలో  భీముడిగా న టించి.. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు ప్రవీణ్‌ కుమార్‌ సోబ్తీ  ఇకలేరు. ఆయన వ యసు 74 ఏళ్లు. సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో ఢిల్లీ అశోక్‌ విహార్‌ నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండెకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నా రని, 10.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారని ప్రవీణ్‌ కుటుంబసభ్యులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్‌ సరిహద్దు భద్రతా దళంలో (బీఎ్‌సఎఫ్‌) డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. అక్కడ అథ్లెటిక్‌ నైపుణ్యాలను గు ర్తించిన అధికారులు ప్రవీణ్‌ను ప్రోత్సహించారు. ఆసియా క్రీడల్లో  డిస్కస్‌ విభాగంలో  1966, 70లో రెండు స్వర్ణాలు గెలుచుకున్నారు. కామన్వెల్త్‌ క్రీడలు(1966),  ఆసియా క్రీడల్లో(1974)హ్యామర్‌ త్రో విభాగంలో రజిత పతకాలను పొందారు. ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ (1968, 1972) పాల్గొన్నారు. కాగా, అథ్లెటిక్‌ రంగం నుంచి ఆయన 1981లో ‘రక్ష’తో సినిమారంగంలోకి ఆరంగేట్రం చేశారు. అయితే మహాభారత్‌ టీవీ సీరియల్‌తోనే ఆయనకు విశేష ప్రాచుర్యం లభించింది. అజోబా, ఆజ్‌ కా అర్జున్‌ ఘాయల్‌ లాంటి చిత్రాల్లోనూ ప్రవీణ్‌ నటించారు.   

 

Updated Date - 2022-02-09T08:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising