ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Praveen Nettaru murder case: బీజేపీ యువత ప్రవీణ్‌ హత్యకేసు.. రంగంలోకి ఎన్ఐఏ

ABN, First Publish Date - 2022-08-07T02:48:11+05:30

దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారె గ్రామానికి చెందిన బీజేపీ యువనాయకుడు ప్రవీణ్‌ నెట్టారు (Praveen Nettaru

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు:  దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారె గ్రామానికి చెందిన బీజేపీ యువనాయకుడు ప్రవీణ్‌ నెట్టారు (Praveen Nettaru) హత్యకేసును దర్యాప్తు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ జాతీయ దర్యాప్తు సంస్థను (NIA) ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్‌ హత్యకేసును ఎన్‌ఐఏ ద్వారా దర్యాప్తు చేయించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. దీంతో కేంద్రప్రభుత్వ అదనపు కార్యదర్శి విపుల్‌ అలోక్‌ ఎన్‌ఐఏ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌కు లేఖ రాశారు. ఆ లేఖను కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి పంపారు.


జులై 26న బెళ్లారెలోని మాస్తి కట్టె వద్ద అక్షయ ఫ్రెష్‌ చికెన్‌ దుకాణం నిర్వహించే ప్రవీణ్‌ను కొందరు వ్యక్తులు కాపుకాసి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. కేరళ, బెంగళూరులలో తలదాచుకున్నవారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ రంగంలోకి దిగడంతో భిన్న కోణాలలో విచారణ జరిపే అవకాశం ఉంది.

Updated Date - 2022-08-07T02:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising