ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు సోనియాతో పీకే భేటీ.. బంపరాఫర్ !

ABN, First Publish Date - 2022-04-21T23:30:55+05:30

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో వరుస మంతనాలు జరుపుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం(రేపు) మరో దఫా చర్చలు జరపనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో వరుస మంతనాలు జరుపుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం(రేపు) మరో దఫా చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రశాంత్ కిశోర్‌కు సోనియా  ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు సోనియాతో భేటీకి ముందు ఎన్డీఏ ఏతర సీఎంలతో ప్రశాంత్ కిశోర్ భేటీ కానున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోపాటు ఆ పార్టీ పెద్దలతో పీకే సుధీర్ఘ భేటీలు నిర్వహించారు. కాంగ్రెస్‌లో పీకే చేరిక దాదాపు ఖాయమైందని భావిస్తున్న తరుణంలో శుక్రవారం జరగబోయే ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పీకేని సోనియా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు 2024 సాధారణ ఎన్నికలకు పీకే అందించిన రోడ్ మ్యాప్‌పై కూడా ప్రకటన వెలువడుతుందా అనే ఆసక్తినెలకొంది.


గతేడాదే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు కనిపించింది. కానీ చర్చలు కార్యరూపం దాల్చకపోవడంతో ఈ వ్యవహారం అర్ధాంతరంగా మరుగునపడింది. అయితే ఇరువర్గాల మధ్య వరుస చర్చల నేపథ్యంలో మరోసారి ఈ అంశంపైచర్చ  తెరపైకి వచ్చింది. గత శనివారం జరిగిన చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరడం దాదాపు ఖాయమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిశోర్ వివరాలతో కూడిన ప్రణాళికను అందించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నియమించిన బృందం ఈ రిపోర్ట్‌ను పరిశీస్తోందని, కమిటీ వారం రోజుల్లో తుది నిర్ణయం చెబుతుందని ఆయన వివరించిన విషయం తెలిసిందే.


కాగా 2014లో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల విజయాల్లోనూ పీకే ఐ-ప్యాక్ టీం ముఖ్యపాత్ర పోషించింది. వైఎస్ఆర్‌సీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు అధికారంలోకి రావడంలో సహాయసహకారాలు అందించారు. కాగా గతంలో ఎంతో వైభవంగా వెలుగొందిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మాత్రమే అధికారంలో కొనసాగుతోంది.

Updated Date - 2022-04-21T23:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising