ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టార్గెట్ 400... కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ సలహా...

ABN, First Publish Date - 2022-04-16T21:51:10+05:30

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్‌కు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీలతో వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులతో శనివారం జరిగిన సమావేశంలో ఈ సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, అజయ్ మాకెన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఓ ప్రజంటేషన్‌ను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని చెప్తున్నాయి. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల వ్యూహాత్మకంగా పొత్తులు కుదుర్చుకోవాలని తెలిపారు. ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని, అందుకు ప్రతిఫలంగా ఆయన ఏమీ కోరుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆయన ప్రదర్శించిన ప్రజెంటేషన్‌లో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. 


Updated Date - 2022-04-16T21:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising