ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్‌లో Liquor Ban విఫలమైంది: Prashant Kishor

ABN, First Publish Date - 2022-06-04T00:09:41+05:30

బీహార్‌ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలులో పూర్తిగా విఫలమైందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హజిపూర్: బీహార్‌ ప్రభుత్వం మద్యపాన నిషేధం (Liquor Ban) అమలులో పూర్తిగా విఫలమైందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant kishore) అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్ వినియోగం జరుగుతూనే ఉందని, ముఖ్యమంత్రి (Nitish Kumar) మాత్రం నిబంధనలు చక్కగా అమలవుతున్నాయనే అభిప్రాయంలో ఉన్నారని విమర్శించారు. హజిపూర్‌లోని వైశాలి జిల్లాలో ''జన్ సూరజ్'' ప్రచార కార్యక్రమంలో పీకే మాట్లాడుతూ, బీహార్‌లో లిక్కర్ నిషేధం అమలు పూర్తిగా విఫలమైందని చెప్పారు. డ్రై స్టేట్‌గా బీహార్‌ను ప్రకటించినప్పటికీ మద్యం కావాలనుకున్న వాళ్లకు చాలా తేలిగ్గా మద్యం దొరుకుతోందన్నారు. అయితే, వాస్తవాలను అంగీకరించడానికి బీహార్ సీఎం సిద్ధంగా లేరని విమర్శించారు.


కాగా, బీహార్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్విటర్‌లో ఒక పోల్‌ను కూడా పీకే ప్రారంభించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం సమర్ధవంతంగా అమలవుతోందా లేదా అనే ప్రశ్నను జనం ముందుంచారు. తన ప్రశ్నకు అవునని కానీ లేదని కాని సమాధానం ఇవ్వాలని కోరారు. దీనిపై సోషల్ మీడియా యూజర్ల స్పందన కూడా మొదలైంది. బీహార్‌లో మద్యం ఉత్పత్తి, వ్యాపారం, స్టోరేజ్ ట్రాన్స్‌పోర్టేషన్, అమ్మకాలు, వినియోగం శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ 2016 ఏప్రిల్ 5న నితీష్ ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. అనంతరం బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-2016కు పలుమార్లు సవరణలు కూడా చేసింది.

Updated Date - 2022-06-04T00:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising