ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజానాయకుడు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి

ABN, First Publish Date - 2022-10-11T09:19:07+05:30

ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌, కేసీఆర్‌, చంద్రబాబు, పవన్‌ సంతాపం 

న్యూఢిల్లీ, అక్టోబరు 10: ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ములాయం మరణం దేశానికి తీరనిలోటని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ములాయం విశిష్ఠమైన వ్యక్తిత్వం గల ప్రజానాయకుడని ప్రధాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ములాయం నిజమైన చాంపియన్‌ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఏపీ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు ములాయం మరణం పట్ల విచారం వ్యక్తంచేశారు. బిహార్‌, పశ్చిమబెంగాల్‌ సీఎంలు నితీశ్‌ కుమార్‌, మమతా, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా సంతాపం తెలిపారు.

Updated Date - 2022-10-11T09:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising