ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాకర్షక పథకాలతో రాష్ట్రాలకు శ్రీలంక పరిస్థితి

ABN, First Publish Date - 2022-04-05T00:29:08+05:30

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ప్రజాకర్షక పథకాలతో ఆయా రాష్ట్రాలు భవిష్యత్తులో శ్రీలంకవంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు కేంద్ర ఉన్నతాధికారులు. గత శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ప్రజాకర్షక పథకాలతో ఆయా రాష్ట్రాలు భవిష్యత్తులో శ్రీలంకవంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు కేంద్ర ఉన్నతాధికారులు. గత శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలపై కేంద్ర ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక రాష్ట్రంలో ప్రకటించిన పథకం ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని, ఇలాంటి పథకాల్నే చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ పథకాలు అమలు చేయడం వల్ల ఆయా రాష్ట్రాలు ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతాయని, ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని భవిష్యత్తులో ఆ రాష్ట్రాలు కూడా ఎదుర్కోవచ్చని ప్రధానికి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్లు రాబట్టుకునేందుకు పలు పార్టీలు ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ఈ పథకాల్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది.

Updated Date - 2022-04-05T00:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising