ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు కరోనాను మాయం చేసే మాయా సాధనాలు కావు: పోప్ ఫ్రాన్సిస్

ABN, First Publish Date - 2022-01-11T02:12:46+05:30

కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. అలాగే, టీకాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాటికన్ సిటీ: కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. అలాగే, టీకాలు తీసుకునేందుకు ప్రజలు భయపడేలా చేస్తున్న ‘నిరాధార సమాచారం’పై పోరాడేందుకు ‘రియాలిటీ థెరపీ’ అవసరమని అభిప్రాయపడ్డారు. టీకా వేసుకోవడాన్ని ‘ప్రేమ పూరిత చర్య’గా గతంలో అభివర్ణించిన పోప్.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వాలను కోరారు.


వాటికన్ సిటీ దౌత్య దళ సిబ్బందితో మాట్లాడుతూ..  కరోనా మహమ్మారి ఒక విధమైన ‘రియాలిటీ థెరపీ’ని అవలంబించమని మనల్ని ప్రోత్సహిస్తోందని, అది సమస్యను ఎదుర్కొనేలా చేస్తోందని అన్నారు. దాని పరిష్కారం కోసం అవసరమైన నివారణలను అందిపుచ్చుకునేలా చేస్తోందని వివరించారు.


టీకాలు అనేవి వ్యాధిని నయం చేసే మాయా సాధనాలు కావని, అయితే అవి వ్యాధి నివారణకు అత్యంత సహేతుకమైన పరిష్కారమని పోప్ అన్నారు. అయితే, టీకాల విషయంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమాన ప్రాప్యత కలిగి ఉండాలన్న ప్రణాళిక ప్రస్తుతం భ్రమగానే మిగిలిపోయిందని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-11T02:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising