ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sudhakar Reddy: మా ఓటింగ్‌ శాతం పెరిగింది..

ABN, First Publish Date - 2022-09-08T14:36:18+05:30

తమిళనాడులో తమ ఓటింగ్‌ శాతం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) తెలిపారు. బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో తమ ఓటింగ్‌ శాతం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘తమిళనాడులో మంచి ఫౌండేషన్‌ వేసుకున్నాం. ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తోంది. అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. గులాంనబీ ఆజాద్‌ వంటి నాయకులు కాంగ్రెస్‌ వదిలిపెట్టి పోతున్నారు. ఈ సమయంలో భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) కన్నా.. కాంగ్రెస్‌ జోడో యాత్రను రాహుల్‌ గాంధీ చేస్తే బాగుంటుంది. గతంలో నేను కూడా కాంగ్రెస్‏కు బలమైన కార్యకర్తనే. ఇక అమెరికా కంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. ప్రపంచ అగ్రనాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని అమెరికా డేటా ఏజెన్సీ గుర్తించడం గర్వంగా ఉంది. తమిళనాడులో కూడా 28శాతం తెలుగువాళ్లున్నారు. ఎన్నికలుప్పుడు రాజకీయాలు ఉండవచ్చు.. అభివృద్ధిలో ఉండకూడదు. భేదాభిప్రాయాలు, ద్వేషాలు లేకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప కేంద్రాన్ని నిత్యం టార్గెట్‌ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్‌ కాదని సుధాకర్‌ రెడ్డి సూచించారు.  

Updated Date - 2022-09-08T14:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising