ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akhilesh Yadav కి బాబాయ్ షాక్..

ABN, First Publish Date - 2022-07-09T22:47:08+05:30

సమాజ్‌వాదీ పార్టీ( Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బాబాయ్ శివ్‌పాల్ సింగ్ యాదవ్(Shivpal Singh Yadav) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ( Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బాబాయ్ శివ్‌పాల్ సింగ్ యాదవ్(Shivpal Singh Yadav) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ(BJP) సారధ్యంలోని ఎన్‌డీఏ(NDA) అభ్యర్థి ద్రౌపతి ముర్ము(Droupadi Murmu)కి మద్దతు ప్రకటించారు. శివ్‌పాల్ సింగ్ యాదవ్, SBSP(సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) చీఫ్ ప్రకాష్ రాజ్‌భర్ శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్(Uttarpradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)తో భేటీ అయ్యారు. డిన్నర్‌లో పాల్గొన్న మరుసటి రోజే ప్రకటన రావడం గమనార్హం.


ఎన్‌డీఏ అభ్యర్థికి మద్ధతు ప్రకటించడంపై శివ్‌పాల్ యాదవ్ స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(yashwant sinha)కి మద్దతుకోరుతూ సమాజ్‌వాదీ పార్టీ తరపున తననెవరూ పిలవలేదు. ఓటు వేయమనీ అడగలేదు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) తనను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ముని కలిశాను. ఆమెకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నానని శివ్‌పాల్ యాదవ్ చెప్పారు.


ఉత్తరప్రదేశ్‌ విపక్షంలో అసమ్మతి పెరుగుతున్న నేపథ్యంలో శివ్‌పాల్ యాదవ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు అఖిలేష్ యాదవ్ తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ రాజకీయ అపరిపక్వతే ఇందుకు కారణమన్నారు. సమాజ్‌వాదీ భాగస్వామ్య పక్షాలు కొత్త మార్గాల్లో పయనించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అఖిలేష్ యాదవ్ తన సలహాలను పాటించివుంటే ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి భిన్నంగా ఉండేదని అన్నారు. భాగస్వామ్య పార్టీలు దూరమవ్వడానికి అఖిలేష్ యాదవ్‌కు రాజకీయ పరిపక్వత లేకపోవడమే కారణమన్నారు.

Updated Date - 2022-07-09T22:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising