ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kashmir Files పేరిట సోషల్ మీడియాలో మాల్‌వేర్‌లు...పోలీసుల హెచ్చరిక

ABN, First Publish Date - 2022-03-16T13:26:17+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరిట హ్యాకర్లు సోషల్ మీడియాలో అనుమానాస్పద మాల్‌వేర్‌లను పంపుతున్నారని పోలీసులు హెచ్చరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరిట హ్యాకర్లు సోషల్ మీడియాలో అనుమానాస్పద మాల్‌వేర్‌లను పంపుతున్నారని పోలీసులు హెచ్చరించారు.కొత్తగా విడుదలైన “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రానికి ఉచిత యాక్సెస్‌ను అందిస్తున్నామనే నెపంతో సోషల్ మీడియా,వాట్సాప్‌లో పంపిన అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని నోయిడా పోలీసులు హెచ్చరించారు. వాట్సాప్‌లో పంపిన మాల్‌వేర్‌లను క్లిక్ చేయడం ద్వారా ఫోన్‌లను హ్యాక్ చేయడం, మొబైల్ నంబర్‌లకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రణవిజయ్ సింగ్ తెలిపారు. 


వ్యక్తుల ఫోన్‌ను హ్యాక్ చేయడానికి లేదా డబ్బు తీసుకోవడానికి హాకర్లు అటువంటి పద్ధతిని ఉపయోగిస్తున్నారని తమకు సమాచారం అందిందని సింగ్ చెప్పారు.ఇటీవల సైబర్ మోసానికి సంబంధించిన 30 లక్షల రూపాయలను కోల్పోయారని పోలీసు అధికారి తెలిపారు.వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు తమతో షేర్ చేసిన లింక్‌లపై క్లిక్ చేయవద్దని సోషల్ మీడియా వినియోగదారులకు సింగ్ సూచించారు.1990వ దశకంలో కశ్మీర్ లోయ నుంచి కాశ్మీరీ పండిట్ల వలసల నేపథ్యంలో తీసిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా వీడియో క్లిప్పింగ్‌లు, లింక్‌లు విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి.




Updated Date - 2022-03-16T13:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising