Viral Video: మహిళను గదిలోకి లాక్కెళ్లి కొట్టిన ఎస్ఐ
ABN, First Publish Date - 2022-12-26T07:14:04+05:30
సాక్షాత్తూ పురుష ఎస్ఐ ఓ మహిళను గదిలోకి లాక్కెళ్లి ఆమెను దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ...
కాన్పూర్(ఉత్తరప్రదేశ్): సాక్షాత్తూ పురుష ఎస్ఐ ఓ మహిళను గదిలోకి లాక్కెళ్లి ఆమెను దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Kanpur Police SI) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగర పరిధిలోని కక్వాన్ ప్రాంతంలో పోలీసు ఎస్ఐ ఒక మహిళను గదిలోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టిన ఘటన సంచలనం రేపింది.(Woman Inside Room Thrashes)ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధికారిక ట్విట్టర్(Twitter) హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.సబ్-ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్‌గా కనిపించే పోలీసు మహిళను కొట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం వీడియోలో కనిపించింది.
ఎస్ఐ కొడుతుండగా బాధిత మహిళ సహాయం కోసం వేడుకోవడం, తలుపులు తెరవమని గది బయట ఉన్న వ్యక్తులు అరవడం కనిపించింది. ‘‘మీరు తలుపు ఎందుకు లాక్ చేశారు, ఆమెను ఏమి చేస్తున్నారు’’ అని వీడియోలో ప్రజలు అరుస్తున్నారు. ‘‘అతను నన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు’’ అని గదిలో నుండి మహిళ అరుస్తూ చెప్పింది.
ఈ ఘటన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది.‘‘కాన్పూర్ పోలీసుల అవమానకరమైన చర్య. ప్రతిరోజూ, యోగి ప్రభుత్వం పౌరులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్న వీడియోలు వెలువడుతున్నాయి, కానీ ముఖ్యమంత్రి యోగి మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి, పోలీసుపై చర్యలు తీసుకోవాలి’’ అని సమాజ్ వాదీపార్టీ డిమాండ్ చేసింది.
Updated Date - 2022-12-26T08:38:33+05:30 IST