ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 వేల మంది టీచర్లను తక్షణం నియమించాలి

ABN, First Publish Date - 2022-06-15T14:04:01+05:30

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు నానాటికీ పెరిగిపోతున్నాయని, అందువల్ల తక్షణం 50 వేల పోస్టులను భర్తీ చేయాలని పీఎంకే వ్యవస్థాపక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డాక్టర్‌ రాందాస్‌ డిమాండ్‌

- 50 వేల మంది టీచర్లను తక్షణం నియమించాలి


అడయార్‌(చెన్నై), జూన్‌ 14: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు నానాటికీ పెరిగిపోతున్నాయని, అందువల్ల తక్షణం 50 వేల పోస్టులను భర్తీ చేయాలని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ రాందాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘రాష్ట్రంలో విద్యాశాఖ కింద 22,831 ప్రాథమిక పాఠశాలలు, 6,587 ప్రాథమికోన్నత పాఠ శాలతో కలిపి మొత్తం 29,418 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 69,640. అంటే ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం 1,66,851 తరగుతులు ఉంటాయి. ఈ లెక్కల ప్రకారం 91,211 తరగతులకు ఉపాధ్యాయులు లేరు. గత యేడాది 2.80 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారని, వారికి 4,500 మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయుల నియామకానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అందువల్ల  50 వేల మంది ఉపాధ్యాయులను నియమించాలి’ అని ఆయన కోరారు. 

Updated Date - 2022-06-15T14:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising