ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ బాధిత అనాథ పిల్లల కోసం PM CARES పథకం

ABN, First Publish Date - 2022-05-30T12:54:56+05:30

కొవిడ్ బాధిత అనాథ పిల్లల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను సోమవారం ప్రారంభించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:కొవిడ్ బాధిత అనాథ పిల్లల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను సోమవారం ప్రారంభించారు.ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం  పిల్లల కోసం పీఎం కేర్స్ పథకం కింద నిధులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేయనున్నారు.పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ ద్వారా కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి మేం మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నారు.అనాథ పిల్లల కోసం పీఎం కేర్స్ పాస్‌బుక్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్‌ని ఈ కార్యక్రమంలో పిల్లలకు అందజేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.


 కొవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా పెంపుడు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడానికి PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను ప్రారంభించారు.23 సంవత్సరాల వయస్సులో రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతో స్వయం సమృద్ధి కోసం వారిని సన్నద్ధం చేయనుంది. ఈ పథకం కింద ఆరోగ్య బీమా కూడా అందించనున్నారు.ఈ పథకం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో కొవిడ్ బాధిత అనాథ పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.


Updated Date - 2022-05-30T12:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising