ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదానికి దారితీసిన Narendra modi ఫ్లెక్సీలు

ABN, First Publish Date - 2022-06-21T17:07:11+05:30

ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతూ మైసూరు సర్కిల్లో మంత్రి మునిరత్న అనుచరులు ఏర్పాటు చేసిన హిందీ భాష ఫ్లెక్సీలు వివాదానికి దారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రధాని మోదీకి హిందీ ఫ్లెక్సీలతో స్వాగతం

- కన్నడ సంఘాల కన్నెర్ర 


బెంగళూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతూ మైసూరు సర్కిల్లో మంత్రి మునిరత్న అనుచరులు ఏర్పాటు చేసిన హిందీ భాష ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. కన్నడ భాషలో కాకుండా హిందీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని కర్ణాటక రక్షణా వేదిక తీవ్రంగా తప్పుపట్టింది. కరవే కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలకు మసిపూసి నిరసన వ్యక్తంశారు. కరవే యువ విభాగం అధ్యక్షుడు టీఏ ధర్మరాజ్‌ నాయకత్వలో కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కన్నడ సంఘాల నిరసనతో ఒక్కసారిగా ఖంగుతున్న బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ఈ ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రధాని పర్యటన ప్రారంభం కావడానికి ముందే ఆదివారం రాత్రికల్లా హిందీభాషలో ఉన్న అన్ని ఫ్లెక్సీలు తొలగించడం గమనార్హం. ప్రధాని దృష్టిలో పడాలన్న ఉత్సాహంలో కొందరు కార్యకర్తలు హిందీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, దీనిని కూడా రాజకీయం చేయడం సరికాదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-21T17:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising