ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి...పుతిన్‌కు సూచించిన మోదీ

ABN, First Publish Date - 2022-03-07T22:09:43+05:30

ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితి, ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితి, ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న శాంతి చర్చల పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ వాకబు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సోమవారంనాడు ఫోన్ చేశారు. దాదాపు 50 నిమిషాల సేపు ఉభయులూ మాట్లాడుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా వెనక్కి పంపించేందుకు సహకరించాలని పుతిన్‌ను మోదీ ఈ సందర్భంగా కోరారు. ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగిస్తూనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని కూడా పుతిన్‌కు మోదీ సూచించినట్టు తెలుస్తోంది. సుమీతో పాటు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా 'మానవతా క్యారిడార్లు' తెరవడం, తాత్కాలిక కాల్పుల విరమణలు ప్రకటిస్తుండటంపై మోదీ అభినందనలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సుమీలోని భారతీయ విద్యార్థులను భారత్‌కు తరలించాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని ఆయనకు వివరించారు. 11 రోజుల క్రితం ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభమైన అనంతరం మోదీ-పుతిన్‌ల మధ్య ఫోను సంభాషణలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి.

Updated Date - 2022-03-07T22:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising