ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prime Minister Narendra Modi: దక్షిణాదిలో ప్రధాని పర్యటన... రూ.25 వేల కోట్ల పనులకు శ్రీకారం

ABN, First Publish Date - 2022-11-11T10:36:00+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు...

Prime Minister Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు. ప్రధాని(Prime Minister) మోదీ (Narendra Modi) దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటిస్తున్నారు. మోదీ శుక్ర, శనివారాల్లో(two day visit) నాలుగు రాష్ట్రాల్లో 25వేల కోట్ల రూపాయలతో కూడిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ఉదయం మోదీ బెంగళూరులోని విధానసౌధాలో కవి కనకదాస, మహర్షి వాల్మీకిల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి మోదీ బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వేస్టేషనులో వందేభారత్ ఎక్స్ ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.చెన్నై- మైసూర్ వందేభారత్ రైలు ప్రారంభంతో ఇండస్ట్రియల్, టెక్, స్టార్టప్ హబ్ ల మధ్య కనెక్టివిటీ ఏర్పడింది.కాశీ దర్శన్ రైలు ప్రారంభంతో కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్ స్థలాల సందర్శనకు వచ్చే యాత్రికులకు సౌలభ్యం ఏర్పడనుంది.

బెంగళూరు నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.5వేల కోట్ల రూపాయల విలువ గల టెర్మినల్ ను ప్రధాని ప్రారంభించారు.ఈ విమానాశ్రయం ఏటా 5 నుంచి 6 కోట్ల ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.గార్డెన్ సిటీ బెంగళూరులో విమానాశ్రయాన్ని గ్రీన్ వాల్స్ తో నిర్మించారు. నందప్రభు కెంపెగౌడ 108 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ లో కాన్వకేషన్ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,500 కోట్లతో పలు పథకాలను ప్రధాని ప్రారంభించనున్నారు. రాయపూర్- విశాఖపట్టణం ఎకనామిక్ కారిడార్ లో ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ పట్టణం ఎకనామిక్ కారిడార్ లో 3,750 కోట్లతో పలు పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.200 కోట్ల రూపాయలతో నరసన్నపేట -పాతపట్నం జాతీయ రహదారిని అభివద్ధి చేశారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంటును మోదీ సందర్శించి, పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

Updated Date - 2022-11-11T10:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising