ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra Minister ఆదిత్య థాకరేకు షాక్ ఇచ్చిన మోదీ భద్రతా సిబ్బంది

ABN, First Publish Date - 2022-06-15T02:48:57+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆయన భద్రతా సిబ్బంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆయన భద్రతా సిబ్బంది మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య థాకరేకి గట్టి షాక్ ఇచ్చారు. మోదీకి స్వాగతం పలికేవారి జాబితాలో ఆదిత్య పేరు లేదంటూ, ఆయనను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కారులో నుంచి దిగిపోవాలని ఆదేశించారు. దీంతో ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆదిత్య తరపున మాట్లాడటంతో చిట్టచివరికి అనుమతించినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. 


ప్రధాని మోదీ మంగళవారం ముంబైలో పర్యటించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆదిత్య థాకరే ఒకే కారులో వెళ్ళారు. పీఎం భద్రతా సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆదిత్యను గమనించి, మోదీకి స్వాగతం పలికే వీఐపీల జాబితాలో ఆదిత్య పేరు లేదని, అందువల్ల కారు నుంచి దిగిపోవాలని ఆయనను ఆదేశించారు. 


స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారుల తీరుతో ఉద్ధవ్ థాకరే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదిత్య తరపున గట్టిగా వాదన వినిపించారు. ఆదిత్య కేవలం తన కుమారుడు మాత్రమే కాదని, రాష్ట్ర కేబినెట్ మంత్రి అని భద్రతాధికారులకు చెప్పారు. అధికారిక ప్రోటోకాల్ ప్రకారం పీఎం మోదీకి ఆదిత్య స్వాగతం పలకవచ్చునని చెప్పారు. ఉద్ధవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత చిట్టచివరికి మోదీకి స్వాగతం పలికేందుకు ఆదిత్య థాకరేను అనుమతించారు. 


Updated Date - 2022-06-15T02:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising