ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవిత్రదినాన నల్లదుస్తులు ధరిస్తారా? రాహుల్‌పై యోగి, షా కన్నెర్ర

ABN, First Publish Date - 2022-08-06T02:02:18+05:30

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ (Congress party) నేతలు ఈరోజు (ఆగస్ట్ 4) నల్లదుస్తులు ధరించి నిరసన తెలపడంపై కమలనాథులు కన్నెర్ర చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ (Congress party) నేతలు ఈరోజు (ఆగస్ట్ 5) నల్లదుస్తులు ధరించి నిరసన తెలపడంపై కమలనాథులు కన్నెర్ర చేశారు. 





ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) గత ఏడాది అయోధ్య రామజన్మభూమి (Ram Janambhoomi)లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసినది ఈరోజేనని (ఆగస్ట్ 5), కాంగ్రెస్ నేతల చర్య రామభక్తులను అవమానించడమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) విమర్శించారు. అయోధ్య దివస్ (Ayodhya Diwas) రోజున కాంగ్రెస్ నేతలు ఇలా చేయడం తగునా అని ఆయన ప్రశ్నించారు. 





ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూటిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని టార్గెట్ చేశారు. పవిత్రమైన రోజున ఎవరైనా నల్లదుస్తులు ధరిస్తారా అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను అవమానపరచడమేనని యోగి అభిప్రాయపడ్డారు. 





వాస్తవానికి కొద్దిరోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (Enforcement Directorate) నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, రాహుల్‌ గాంధీని ప్రశ్నించింది. దీంతో కేంద్రంపై మండిపడుతోన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రూపాయి పతనంపై ధర్నాలకు దిగుతున్నారు. ఇందులో భాగంగానే రాహుల్, ప్రియాంక సహా పలువురు కాంగ్రెస్ నేతలు నేడు నల్ల దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిపారు.



Updated Date - 2022-08-06T02:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising