ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమత సమక్షంలో సీఎన్‌సీఐ రెండో క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2022-01-07T19:36:22+05:30

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన మోదీకి మమత ధన్యవాదాలు తెలిపారు. 


మమత మాట్లాడుతూ, ఈ ఇన్‌స్టిట్యూట్‌కు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని, తన కాలేజీ రోజులు ఈ ప్రాంతంలోనే గడిచాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 


మోదీ ఇటీవల ఇచ్చిన ట్వీట్‌లో, సీఎన్‌సీఐ వల్ల తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సేవలు మరింత పెరుగుతాయని తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, సీఎన్‌సీఐ రెండో క్యాంపస్‌ను మోదీ దార్శనికతకు అనుగుణంగా నిర్మించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం, విస్తరించడం మోదీ కల అని తెలిపింది. 


భద్రతా లోపం బయటపడటంతో మోదీ జనవరి 5న పంజాబ్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇదే. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, మమత బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-07T19:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising