ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ujjain Mahakal Lok: శివుడే జ్ఞానం... జ్ఞానమే శివుడు: మోదీ

ABN, First Publish Date - 2022-10-12T03:11:22+05:30

భోపాల్: శివుడే జ్ఞానమని, జ్ఞానమే శివుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: శివుడే జ్ఞానమని, జ్ఞానమే శివుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను జాతికి అంకితం చేశాక అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. శివుడి శరణులో మరణం కూడా ఏమీ చేయలేదని మోదీ చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా చార్‌ధామ్ ప్రాజెక్ట్ కింద అన్ని వాతావరణాలకు తట్టుకునేలా రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. బానిస మనస్తత్వాన్ని వదిలి భారత వారసత్వంపై గర్వపడాలని ప్రధాని సూచించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, కాశీ కారిడార్ భారత సంస్కృతిపై గర్వపడేలా రూపొందిందని మోదీ చెప్పారు.   



అంతకు ముందు సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రధాని మహాకాళ్ మందిరంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మహాకాళ్ లోక్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహాకాళ్ మందిరాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-10-12T03:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising