ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ పదవి!

ABN, First Publish Date - 2022-03-18T02:22:27+05:30

అవిశ్వాస తీర్మానానికి ముందే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: అవిశ్వాస తీర్మానానికి ముందే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ)కి చెందిన 24 మంది ఎంపీలు ప్రతిపక్షంతో కలిసి వెళ్లాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. వీరిలో చాలా మంది ఎంపీలు తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఇస్లామాబాద్‌లోని సింధ్ హౌస్‌లో ఆశ్రయం పొందారు. ప్రతిపక్షంతో చేతులు కలపడంతో ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 


సింధ్ ప్రావిన్స్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న సింధ్ హౌస్ ప్రభుత్వ అధికారిక భవనం. సింధ్ ప్రావిన్స్‌లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లి లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో రెబల్ ఎంపీలు తాము తలదాచుకునేందుకు ఇదే సురక్షిత స్థలమని భావించారు. 


అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోబోనని ప్రధాని ఇమ్రాన్ హామీ ఇస్తే తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు రెబల్ ఎంపీ రాజా రియాజ్ తెలిపారు. ప్రస్తుతం 24 మంది ఎంపీలు సింధ్ హౌస్‌లో ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు, మున్ముందు మంత్రులు, మరెంతోమంది ఎంపీలు కూడా సింధు హౌస్‌కు వస్తారని బాంబు పేల్చారు.   

Updated Date - 2022-03-18T02:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising