ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్లాస్టిక్‌ నిషేధ చట్టం’ అమలు.. వాడితే రూ. లక్ష జరిమానా, జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-07-02T15:26:44+05:30

రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్లాస్టిక్‌ నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ సంచులు, ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్లాస్టిక్‌ నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ సంచులు, ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై ప్రత్యేక నిషేధ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఇటీవల కేంద్రప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఒకసారిమాత్రమే ఉపయోగించడానికి వీలున్న ప్లాస్టిక్‌ వస్తువులను ఉత్పత్తి చేయడం, విక్రయించడం, ఉపయోగించడం శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు. ఈ చట్టాన్ని అతిక్రమించేవారిపై పర్యావరణ భద్రతా చట్టం సెక్షన్‌ 15 ప్రకారం కఠిన చర్యలు చేపడతారు. ఆ మేరకు లక్ష రూపాయల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఆ మేరకు శుక్రవారం నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధ చట్టం అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ప్లాస్టిక్‌ వస్తువుల వాడకంపై నిషేధం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ‘పసుపు సంచుల’ వినియోగాన్ని అమలు చేసింది. ప్లాస్టిక్‌ సంచులకు బదులు గుడ్డతో తయారైన పసుపు సంచులను వాడాలని రాష్ట్రమంతటా ముమ్మర అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిచింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, కార్పొరేషన్‌, మున్సిపల్‌ కమిషనర్లు ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధచర్యలు చేపడుతున్నారు. షాపింగ్‌మాల్స్‌, కిరాణా దుకాణాలు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో అధికారులు వాణిజ్య దుకాణాలు, వస్త్ర దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేసి ప్లాస్టిక్‌ సంచులను స్వాధీనం చేసుకున్నారు. రాయపేట, ట్రిప్లికేన్‌, మైలాపూరు, టి.నగర్‌, కోడంబాక్కం తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్‌ అధికారులు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. పలు దుకాణాలలో ప్లాస్టిక్‌ సంచులను స్వాధీనం చేసుకుని ఇకపై ప్లాస్టిక్‌ సంచులను ఉపయోగిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్‌ నిషేధ చట్టం అమలులోకి వచ్చిన తొలి రోజు కావటం వల్ల జరిమాన విధించకుండా వదలిపెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-02T15:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising