ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fact Check: ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 30 వేలు.. నిజమెంతో తేల్చేసిన PIB

ABN, First Publish Date - 2022-05-24T22:43:23+05:30

దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడి ఖాతాలో రూ.30,628లు జమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడి ఖాతాలో రూ.30,628లు జమ చేయబోతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. ఈ సమాచారాన్ని ఫ్యాక్ చెక్ Fact Check ద్వారా పరిశోధించిన పీఐబీ ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి కొట్టిపడేసింది. ఈ మేరకు స్వదేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo) ద్వారా పౌరులను హెచ్చరించింది. తప్పుదారి పట్టించే ఇలాంటి ‘నకిలీ సమాచారం’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


పౌరులకు ఆర్థిక సాయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి సాయాన్ని ప్రకటించలేదని పీఐబీ స్పష్టం చేసింది. అలాగే, దేశంలోని  నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 3,500 భత్యం ఇస్తున్నట్టు వస్తున్న వార్తలు కూడా నకిలీవేనని తేల్చింది. ఈ సమాచారం కూడా నకిలీ (Fake)దేనని పేర్కొంది. పౌరులను తప్పుదోవ పట్టించే ఇలాంటి వాటిపై ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Updated Date - 2022-05-24T22:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising